అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కక్కలపల్లి వద్ద ఉన్న కిమ్స్ సవేరా ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాజీ టిడిపి జిల్లా అధ్యక్షుడు పున్నం హనుమంతరాయ చౌదరి మాజీ జెడ్పిటిసి చెన్నకేశవలను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి నుంచి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ మాజీ టిడిపి జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయ చౌదరి ఐసీయూలో చికిత్స పొందుతున్న సందర్భంలో ఆయన పరామర్శించి సవేరా డాక్టర్లను మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.