హిమాయత్ నగర్: మున్సిపల్ శాఖ పరిధిలోని అమృత్ పథకంలో రూ. 8800 కోట్ల అవినీతి జరిగింది: మాజీ మంత్రి కేటీఆర్
బంజారాహిల్స్ లోని బీఆర్ఎస్ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖ పరిధిలోని అమృత్ పథకంలో 8800 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అన్నారు. అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకొని వచ్చి రేవంత్ కుటుంభ సభ్యులకు ప్రజాధనాన్ని అందిస్తున్నాడని అన్నారు.