అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బాచుపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారి పక్కన వెలసిన బాటసుంకులమ్మ ఆలయంలో నిర్వహించిన టెంకాయల వేలం పాట 46 లక్షల 30 వేలు పలికింది. బాట సుంకలమ్మ ఆలయ ఆవరణలో గురువారం జరిగిన వేలం పాటలో 2026 సంక్రాంతి నుంచి 2027 సంక్రాంతి పండుగ వరకు ఏడాది పాటు ఆలయ ఆవరణలో టెంకాయలు విక్రయానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. మొత్తం 20 మంది రూ.500 డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొన్నారు. పోటా పోటీగా జరిగిన వేలం పాటలో గుత్తి మండలం వన్నేదొడ్డికి చెందిన మద్దయ్య అనే వ్యక్తి రూ.46.30లక్షలకు వేలం పాట దక్కించుకున్నాడు. గతేడాది రూ.35.60 లక్షలకు వేలం పోయింది