బోధన్: రెంజల్ కందకుర్తి గోదావరి పరివాహక ప్రాంతాలను పరిశీలించిన సిపి సాయి చైతన్య
రెంజల్ మండలం కందకుర్తి గ్రామ సమీపంలో గల కందకుర్తి గోదావరి బ్రిడ్జిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య శుక్రవారం నాడు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కందకుర్తిలో గల ఎగువన నిజాంసాగర్ ప్రాజెక్టు, మరియు విష్ణుపురి, నాందేడ్ జిల్లా నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వల్ల కందకుర్తి గోదావరి బ్రిడ్జిపై నుండి నీటి ప్రవాహం భారీగా ప్రవహిస్తున్న సందర్భంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రానున్న రెండు , మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.