సున్నిపెంటలో భూ అక్రమణదారులకు నోటీసులు భయాందోళనలో భూ ఆక్రమణదారులు
శ్రీశైలం ప్రాజెక్టు భూ అక్రమణదారులకు అధికారులు మంగళవారం నోటీసులు పంపిణీ చేశారు. హైకోర్టు ఉత్తర్వులతో జల వనరుల శాఖ భూములు, గృహాల కబ్జాపై కలెక్టర్ ఆదేశాలతో కొద్దిరోజుల క్రితమే సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. భూ ఆక్రమణ దారులుపై చర్యల్లో భాగంగా మండల తహశీల్దార్ శ్రీనివాసులు పర్యవేక్షణలో 13 సర్వే బృందాలు అక్రమణదారులకు నోటీసులను అందజేస్తున్నారు. దీంతో భూ ఆక్రమణదారులో భయాందోళన మొదలైంది.