అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సును శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకొని గుత్తి పోలీసు స్టేషన్ కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో దిల్ కా శ్రీనా పెట్రోల్ బంక్ వద్ద గుత్తి నుంచి పెద్దవడుగూరుకు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని అనంతపురం వైపు నుంచి వస్తున్న బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరాముడు, మల్లికార్జున లు గాయపడ్డారు. స్థానికులు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును నిలిపి డ్రైవర్ కుళ్ళాయప్ప ను అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.