అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో ఉన్న శ్రీ సాయి జూనియర్ కళాశాలలో శ్రీ యోగివేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సాయి కళాశాలలో యోగి వేమన కమిటీ మాజీ గౌరవాధ్యక్షులు న్యాయవాది జయరాంరెడ్డి, డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ గౌరవ సలహాదారుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి, గౌరవ సలహాదారులు పామిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యోగి వేమన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.