అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో రాయలసీమ కుర్రాడు యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుని మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన యువ హీరో కిరణ్ అబ్బవరం ,నటించిన కె. ర్యాంప్ చిత్రం విడుదల సందర్భంగా రాయచోటి లోని ప్రసాద్ థియేటర్లో కిరణ్ అబ్బవరం అభిమానుల మధ్య హీరో కుటుంబ సభ్యులు చిత్రాన్ని విక్షించారు. హీరో తండ్రి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ తండ్రికి కొడుకుకు మధ్య జరిగే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని కామెడీ లవ్ ఫైట్స్ ఇలా ప్రతి ఒక్క సీన్ ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా విక్షించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పాల్గొన్నారు.