కొడిమ్యాల: పూడూరు గ్రామంలో రైలు ఢీకొని 20 గొర్రెలు మృతి రెండున్నర లక్షల మేర నష్టం
జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండలం,పూడూరు గ్రామంలోని శనివారం సాయంత్రం 6:20 నిమిషాలకు రైలు ఢీ కొని గోర్లు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది,కొమురయ్యకు చెందిన 20 గొర్రెలను గొర్ల కాపరి మేపుకుంటూ వెళ్తుండగా,రైలు పట్టాల ఆవలి వైపు గడ్డి కనిపించడంతో గొర్రెలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తూ ఉండగా,రైలు రావడానికి గమనించిన గొర్ల కాపరి గొర్రెలను కాపాడే యత్నం చేసినప్పటికీ వేగంగా వచ్చిన రైలు గొర్లను ఢీ కొట్టింది,దీంతో 20 గోర్లు మృత్యువాత పడ్డాయి,దీంతో రెండున్నర లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపాడు గొర్ల రైతు కొమురయ్య,