నారాయణపేట్: ఫింగర్ ప్రింట్ డివైస్ తో పోలీసుల తనిఖీలు: పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు
నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ముందస్తు నేరాల నియంత్రణలో భాగంగా శుక్రవారం దొంగతనాల నివారణ లక్ష్యంగా అనుమానిత వ్యక్తులను పాత నేరస్తులను గుర్తించడానికి బ్లూ కోర్ట్స్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నారాయణపేట బస్టాండ్ మరియు ప్రధాన చౌరస్తాలలో పట్టణ పోలీసులు ఆకస్మికంగా ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో తనిఖీలు నిర్వహించారు.