శ్రీశైలం: వేసవి కాలం దృశ్య శ్రీశైలం క్షేత్రంలో పలుచోట్ల మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేసిన దేవస్థానం అధికారులు
శ్రీశైల క్షేత్రంలో వేసవి దృశ్య దేవస్థానంలోని పలుచోట్ల మజ్జిగ చలివేంద్రాలను సోమవారం నుంచి శ్రీశైలం దేవస్థానం అధికారులు ప్రారంభించారు.క్షేత్రంలోని నంది సర్కిల్ హాస్పిటల్ సర్కిల్ ,దేవస్థానం వెనుక భాగంలో ఇలా పలుచోట్ల మజ్జిగ చలివేంద్రాలు అలాగే చల్లటి నీరును దేవస్థానం అధికారులు అందిస్తున్నారు.వేసవికాలంలో శ్రీశైలం దేవస్థానానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుండడంతో,వేసవి తాపానికి గురికాకుండా ఇలా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క భక్తుడు ఉపయోగించుకోవాలని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అన్నారు.మజ్జిగ చలివేంద్రాలని ఏర్పాటు చేయడంపై భక్తులు సంతోషించారు.