కొత్తపేట: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు: వైసిపిపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఫైర్
కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించి 16,800 మందికి అన్యాయం చేసిందని ఆరోపించారు. రిజర్వేషన్ల పునరుద్ధరణ కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని, బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.