గత వైసీపీ పాలనలో ప్రతిపక్షాల నోర్లు మూయించి జగన్ పాలన సాగించారాని, పెద్దాపురం మీడియా సమావేశంలో MLA రాజప్ప అన్నారు
గత వైసిపి ప్రభుత్వం లో ప్రతిపక్షాలను నోర్లు మూయించి జగన్ పాలన సాధించారని ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన సమయం ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇస్తున్న అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావడం లేదని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు పెద్దాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.