శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని భూ ఆక్రమణలపై 13 సర్వే బృందాలను ఏర్పాటుచేసిన హైకోర్టు
శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని ఆక్రమణలపై పూర్తిస్థాయి సర్వే కోసం అధికారులు 13 బృందాలను ఏర్పాటు చేశారు.హైకోర్టు ఉత్తర్వుల మేరకు గురువారం నిర్వహించిన సమావేశంలో సర్వే విధివిధానాలపై చర్చించారు. వారం రోజుల్లో ఈ 13 బృందాలు సర్వే చేసి, పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసులు, ఇరిగేషన్ ఈఈ సురేష్, ల్యాండ్ సర్వే అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.