శ్రీశైలం: స్వర్ణాంధ్ర,స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వెలుగోడు గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న నీటి వనరుల ప్రక్షాళన, పునరుద్ధరణ పనులను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పరిశీలించారు. అనంతరం కార్మికులు, గ్రామస్థులతో కలిసి సామాజిక నీటి వనరుల సంరక్షణ, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. నీటి వనరుల పరిరక్షణ, గ్రామ పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.