ముధోల్: రోడ్లపై సోయా పంటను ఆరబెడితే కఠిన చర్యలు: ముధోల్ సీఐ హెచ్చరిక
రోడ్లపై సోయా పంటను ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల వాహనదారుల ప్రాణాలకు ముప్పు ఉందని ముధోల్ సీఐ రవీందర్ నాయక్ హెచ్చరించారు. బాసర మండలం బిద్రెల్లిలో రైతులకు అవగాహన కల్పిస్తూ.. రోడ్లపై పంట ఆరబెట్టేవారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.