బనగానపల్లె: శ్రీ సిటీ ప్రమాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దిగ్భ్రాంతి
శ్రీసిటీలో బాయిలర్ పేలుడు ఘటనలో కార్మికులు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. శనివారం మంత్రి మాట్లాడుతూ..క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు.