శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76 జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని అన్న క్యాంటీన్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అన్న క్యాంటీన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే స్వయంగా పేదలకు భోజనం వడ్డించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదే సందర్భంగా చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి భువనేశ్వరి రూ.76 లక్షల విరాళంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని అన్న క్యాంటీన్‌లలో ఉచిత అన్నదానం ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది.