శ్రీశైలంలో భక్తుల సౌకర్యాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం వచ్చే భక్తులకు సంతృప్తికరమైన ఏర్పాట్లు చేయాలని ఈవో శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలో భక్తుల సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. దర్శనం, మంచినీరు, అన్నప్రసాద వితరణపై 90 శాతం భక్తుల నుంచి సానుకూల స్పందన రావడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మెరుగైన వసతుల కల్పనకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన సూచించారు. వేసవికాలం ని దృష్టిలో ఉంచుకొని చలువ పందిళ్ళను ఏర్పాటు చేయాలన్నారు.