శ్రీశైలం: శ్రీశైల మల్లన్న ఆలయానికి సుమారు కోటి రూపాయల విలువగల బంగారు వెండి వస్తువులను విరాళంగా ఇచ్చిన కాకినాడకు చెందిన భక్తుడు
శ్రీశైలం మల్లన్న ఆలయానికి కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన భక్తుడు వ్యాపారవేత్త లలితా ఎంటర్ ప్రైజెస్ మట్టే శ్రీనివాస్ విద్యులత దంపతులు శ్రీస్వామి అమ్మవార్లకు పలు వెండి,బంగారు అభరణాలను విరాళంగా సమర్పించారు విటీలో బంగారు నామాలు,చంద్రవంక కలిగిన వెండి జటాజూటం వెండి పూజావస్తువులు,బంగారు రుద్రాక్షమాల, మంగళసూత్రాలను సమర్పించారు వెండి వస్తువుల బరువు 42 కేజీల 516 గ్రాములు కాగా,బంగారు అభరణాల బరువు 73 గ్రాముల 500 మిల్లీ గ్రాములు వీటి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉండొచ్చని దాతలు తెలిపారు.