పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ కస్టమర్ల వద్ద నుంచి 1కోటి 30 లక్షల ఆర్థిక నేరానికి పాల్పడ్డ ఆత్మకూరు కు చెందిన యువకుడు.
ఆత్మకూరు పట్టణంలోని ఓ పెట్రోలు బంకులో పని చేస్తున్న రపిక్ అనే యువకుడు దాదాపు రూ.1.3 కోట్ల ఆర్థిక మోసానికి పాల్పడ్డాడు. తనకు పరిచయమున్న వ్యక్తులు, పెట్రోలు బంకుకు వచ్చే వినియోగదారుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో మూడు రోజుల క్రితం పరారయ్యాడు. మోసపోయామని తెలుసుకున్న జనం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆత్మకూరుకు చెందిన రపిక్ అనే యువకుడు పెట్రోలు బంకులో పని చేస్తున్నాడు. పెట్రోల్ కోసం బంకు వద్దకు వచ్చే కొంత మంది నుంచి క్రెడిట్ కార్డు తీసుకుని పెట్రోలు బంకు కరెంటు ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు మోసపోయిన వ్యక్తులు చెబుతున్నారు.