పటాన్చెరు: బీసీలను మోసం చేసిన ప్రభుత్వం : 112వ డివిజన్ బిఆర్ఎస్ నేత మాణిక్ యాదవ్ తీవ్ర విమర్శలు
బీసీ బంద్కు మద్దతుగా పటాన్చెరు 112వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నేత ఐలాపూర్ మాణిక్ యాదవ్ నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల కోసం మెమొరాండం సమర్పించారు. మాణిక్ యాదవ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. కామారెడ్డి హామీలను కోర్టు స్టేజీకి తీసుకువచ్చారు అన్నారు. బీసీ బిల్లును వెంటనే అమలు చేసి, 9వ షెడ్యూల్లో చేర్చాలి అని డిమాండ్ చేశారు.