ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో ఈనెల 31 నుండి నవంబర్ 14 వరకు ప్రపంచ శాంతి కోసం మహాయాగం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలో ఈనెల 31 నుండి నవంబర్ 14 వరకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సహాయ సహకారాలతో మరియు వేద పండితుల శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో “87వ విశ్వశాంతి మహాయాగం” నిర్వహిస్తున్నట్లు పండితులు మరియు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అందుకు సంబంధించి శుక్రవారం పట్టణంలోని వివర్స్ కాలనీ మైదానంలో ఏర్పాట్లు భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు.