శ్రీశైలం: శ్రీశైలానికి భక్తుల రద్దీ పెరగడంతో దోర్నాల, తెలంగాణ వైపు రహదారులు సరిపోవడం లేదు: మంత్రి ఆనం
సున్నిపెంటలో నిర్మించిన దేవస్థానం స్టాఫ్ క్వార్టర్స్‌ను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.క్వార్టర్స్ నిర్మాణాలు నాణ్యంగా ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులు త్వరలోనే ఈ క్వార్టర్స్‌లోకి వచ్చి చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్వార్టర్స్ పరిసరాల్లో రూ.10 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. శ్రీశైలం నుంచి సున్నిపెంటకు ఉద్యోగుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా దేవస్థానం బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విధులకు సకాలంలో హాజరయ్యేలా షిఫ్ట్‌ల తరలిస్తామన్నారు.