అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం 12 50 నిమిషాల సమయంలో ఏపీ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో రాప్తాడు సిపిఎం పార్టీ రూరల్ ప్రాంతీయ కార్యదర్శి రామాంజనేయులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాప్తాడు రూరల్ ప్రాంతీయ కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ ఏపీ గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతు తెలపడం జరిగిందని కార్మికులకు కనీస వేతనం అమలు చేసి ప్రభుత్వమే వేతనాలు నేరుగా చెల్లించాలని ధర్నా నిర్వహిస్తున్నామని సిపిఎం పార్టీ రాప్తాడు రామాంజనేయులు పేర్కొన్నారు.