విశాఖపట్నం: పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో గంజాయి రవాణా నియంత్రణకు డాగ్ స్క్వాడ్ తో ప్రత్యేకత తనిఖీలు
గంజాయి రవాణా నియంత్రణకు డాగ్ స్క్వాడ్ తనిఖీలు. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు గంజాయి రవాణా నియంత్రణను అరికట్టడానికి ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కోరియర్ ఆఫీసులు మరియు పలు చోట్ల డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడమైనదని మంగళవారం పోలీస్ కమిషనర్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు