సిద్దిపేట అర్బన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుస్సాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో మొక్కలు నాటిన విద్యార్థులు
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) కు చెందిన ఎన్ఎస్ఎస్ యూనిట్ 4 ఆధ్వర్యంలో సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలో, ఎన్ఎస్ఎస్ యూనిట్ 7 ఆధ్వర్యంలో వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం వనమహోత్సవం నిర్వహించి మొక్కలు నాటారు. ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదన విస్తరణ, భవిష్యత్ తరాల కోసం సురక్షిత వాతావరణం సృష్టించడం వంటి మహత్తర లక్ష్యాలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) సిద్దిపేట ఎన్ఎస్ఎస్ నాలుగవ విభాగం, ఎన్ఎస్ఎస్ ఏడవ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వన మహోత్సవ వేడుక బుస్సాపూర్, వెంకటాపూర్