వనపర్తి: వనపర్తిలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం: లక్ష్యాలను వివరించిన చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
వనపర్తి ఐ.డి.ఓ.సీ. ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ప్రజా సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా పాలన సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.