శ్రీశైలం: చెంచు డ్రైవర్లకు అటవీ శాఖ అధికారుల మధ్య వివాదం.ఇష్టకామేశ్వరి ఆలయ దర్శనం తాత్కాలికంగా నిలిపివేసిన అటవీ శాఖ అధికారులు
శ్రీశైలం సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనాన్ని అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అటవీశాఖ సిబ్బంది మరియు చెంచు గిరిజన డ్రైవర్ల మధ్య తలెత్తిన వివాదమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.సమాచారం ప్రకారం, ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా డీఎఫ్ఓ వారికి ఎదురయ్యారు. “మిమ్మల్ని ఎవరు పంపించారు? ఎవరి అనుమతితో వెళ్లారు?” అంటూ ప్రశ్నించగా, వారు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. దీంతో వారి ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.