శ్రీశైలం: ఆత్మకూరు వైయస్సార్ స్మృతి వనంలో ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు
ఆత్మకూరు మండలంలోని వైయస్ అర్ స్మృతి వనంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ అర్ 77 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త శిల్పా భువనేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంస్య విగ్రహానికి పార్టీ నాయకులు,కార్యకర్తలు, వైయస్ అర్ అభిమానులు పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా శిల్పా భువనేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.మహానేతకు మరణం లేదని వైయస్సార్ భౌతికంగా లేనప్పటికీ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. దశాబ్దం కాలం గడిచినప్పటికీ వైయస్సార్ సంతకం చదరలేదని... ఇప్పటికి ఆయన నిర్మించిన ప్రాజెక్టుల వల్లే రైతులు సుభిక్షంగా ఉన్నారని వివరించారు.