రొల్ల మండలంలో ఒక్క చెట్లను నరికేసిన దుండగులు
రొళ్ల మండలం హనుమంతుని పల్లి గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. రైతు రంగనాథ్ కు చెందిన 50 ఒక్క చెట్లను గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి నరికివేశారు. శనివారం తోటకు వెళ్లిన రంగనాథ్ నరికేసిన చెట్లను చూసి లబోదిబోమన్నాడు. నాలుగేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న ఒక్క చెట్లు కాపుకు వస్తున్న సమయంలో ఇలా నరికి వేయడం దారుణమని ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశాడు.