చెన్నూరు: మందమర్రిలో ఘనంగా విశ్వకర్మ జయంతి
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం లోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం విశ్వకర్మ జయంతిని ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కులమత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండగ విశ్వకర్మ జయంతి అని, పురాణాల ప్రకారం, విశ్వకర్మ పుట్టిన రోజునే ‘విశ్వకర్మ జయంతి’గా జరుపుకుంటారనీ తెలిపారు. విశ్వకర్మ పూజతో పాటు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారనీ, విశ్వ కర్మ సూర్యుని కిరణాలకు రూపం ఇచ్చాడని, అందుకే ఆయనను పౌరాణిక కాలపు ఇంజనీర్ అని కూడా అంటారనీ పేర్కొన్నారు.