బత్తిలి-వడ్డంగి ఎత్తిపోతల పథకానికి నిధులు ఇవ్వాలని బత్తిలిలో నిర్వహించిన రైతు సదస్సులో ఏపీ రైతు సంఘం నేతలు డిమాండ్
పార్వతీపురం మన్యం జిల్లా, భామిని మండలంలో ని బత్తిలిలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.వి.వి ప్రసాద్ మాట్లాడుతూ బత్తిలి వడ్డంగి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. తక్షణమే జిల్లాలోని నాగావళి, వంశధార, వేగావతి, చంపావతి తదితర నీటి వనరుల ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.