కర్నూలు: ఆరోగ్య ఏపీగా తీర్చిదిద్దుతాం: కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్
ఆరోగ్య ఏపీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ అన్నారు. ఆదివారం కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టుపైన నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సుమారు 500 మందికి పైగా పాల్గొని యోగాసనాలు వేశారు.