చంద్రశేఖర పురం: చంద్రశేఖరపురం ఎస్సీ ,ఎస్టీ కాలనీలలో పోలీసుల కార్డెన్ సెర్చ్, ఎటువంటి ధ్రువపత్రాలు లేని 25 బైకులు, 5 ఆటోలను సీజ్
India | May 3, 2026
చంద్రశేఖరపురం లోని ఎస్సీ, ఎస్టీ కాలనీలలో పోలీసులు ఆదివారం కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ ఆధ్వర్యంలో అనుమానితుల ఇళ్లలో పోలీసులు శోదాలను చేపట్టారు. ఎటువంటి ధ్రువపత్రాలు లేని 25 మోటార్ బైకులను, 5 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం సీఐ సుధాకర్ మాట్లాడుతూ... గంజాయి వంటి మత్తు పదార్థాలను విక్రయించినా, అక్రమంగా నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.