సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
ప్రకృతిని ప్రేమించే గొప్ప సంస్కృతి తెలంగాణ వారిదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు కోమటి చెరువు వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకలను సందర్శించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగలను ఎంతో గొప్పగా జరుపుకుంటూ తెలంగాణ గొప్పతనాన్ని చాటిచెబుతున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ పండుగలకు గుర్తింపు లభించలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పండుగలను గుర్తించి అధికారికంగా నిర్వహించారని గుర్తు చేశారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్