జమ్మికుంట: మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ పై దాడి చేసిన వ్యక్తిపై నాన్ బేలేబుల్ కేసు పెట్టి అరెస్టు చేయాలి మున్సిపల్ కమిషనర్ ఆయాజ్
జమ్మికుంట : మహబూబ్ నగర్ మునిసిపల్ కమీషనర్ ప్రవీణ్ రెడ్డిపై మాజీ ప్రజా ప్రతినిధి దాడి పట్ల మున్సిపల్ కమీషనర్ అసోసేషన్ పక్షాన తీవ్రంగా ఖండిచారు. దాడికి నిరసనగా బుధవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ పై దాడికి పాల్పడిన వ్యక్తి పై ప్రభుత్వం, ఉన్నత ఆదికారులు స్పందించి నాన్ బెలబుల్ కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, ఏ.ఈ వికాస్, JAO రాజశేకర్ రెడ్డి, టిపిబివో దీపిక, సీనియర్ అసిస్టెంట్లు భాస్కర్ పాల్గొన్నారు.