ఆత్మకూరు పట్టణంలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో SIR పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి బూత్ స్థాయిలో ఓటర్ల వివరాలను పరిశీలించి, ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయాన్ని సాధించాలన్నారు.