బోధన్: బోధన్ పట్టణంలో గుర్తుతెలియనీ వ్యక్తి మృతదేహం లభ్యం
బోధన్ పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు టౌన్ సిఐ వెంకటనారాయణ సోమవారం తెలిపారు. పట్టణంలోని ఆచన్ పల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి సుమారు 40 సంవత్సరాల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ఎవరైనా గుర్తుపడితే పట్టణ పోలీస్ స్టేషను సంప్రదించాలన్నారు. మృతుడు భిక్షాటన చేసే వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు.