నాంపల్లి: మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం రోజు కూడా ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం వద్ద యూరియా కోసం పడిగాకులుగాసిన అన్నదాతలు
నల్గొండ జిల్లా, నాంపల్లి మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం వద్ద యూరియా కోసం పడిగాపులు రాశారు. ఉదయం 5 గంటల నుండి క్యూ లైన్ లో బారులు తీరారు. శుక్రవారం మధ్యాహ్నం పలువురు రైతులు మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం రోజు కూడా యూరియా కోసం పడి కాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సస్యరక్షణ చేయాల్సిన సమయంలో యూరియా కోసం రోడ్లపై నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.