ధర్మపురి: ధర్మపురిలో ముస్లిం దంపతుల ప్రత్యేక పూజలు
ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్కే మల్సూర్, హలీమా అనే ముస్లిం దంపతులు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని వీరు ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు.