ప్రైమరీ సెక్టార్ పై వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ ఆనంద్ సమీక్ష
Anantapur Urban, Anantapur | Mar 31, 2026
అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల అధికారులతో (ప్రైమరీ సెక్టార్) పై జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సమీక్ష నిర్వహించారు. ముందుగా గత ప్రైమరీ సెక్టార్ సమావేశంలో చర్చించిన అంశాలపై వివిధ శాఖ అధికారులు తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ సమీక్షించారు.ఇందులో వ్యవసాయ శాఖలో ప్రస్తుతం అములు అవుతున్న పథకాల ప్రగతి గురించి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ APFR (రైతు రిజిస్ట్రేషన్)లో ఇంకా ఎవరైనా రైతులు మిగలి ఉంటే వారిని కూడా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.