అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లో నవంబర్ 1న రైతు గర్జన: ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేటీఆర్
ఆదిలాబాద్ డైట్ మైదానంలో నవంబర్ 1న రైతు గర్జన నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. రైతుల సమస్యలపై కేటీఆర్ ఈ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి తరలిరావాలని గ్రామ, పట్టణ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.