ఖమ్మం అర్బన్: పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలీస్ కమీషనర్ సునీల్ దత్
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీపీ సునీల్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1959 అక్టోబర్ 21న జరిగిన ఘటనను గుర్తు చేస్తూ, అమరవీరుల త్యాగాలను కొనియాడారు. పోలీసుల కుటుంబాలకు శాఖ ఎప్పటికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.