కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను ఏకపక్షంగా ప్రకటించడాన్ని సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్ తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎంతగానో కష్టపడి 29 కార్మిక చట్టాలను సాధించుకున్నామని ఇప్పుడు అవి నిర్వీర్యం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 26వ తేదీన ఆందోళన చేస్తామన్నారు.