శ్రీశైలం: శ్రీశైలం పాదయాత్ర భక్తులకు నాగలూటి గూడెం నుంచి ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేయాలి
ఆత్మకూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి పలువురు వినతిపత్రాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మైనారిటీ మోర్చా నాయకురాలు మోమిన్ షబానా, పాల్గోన్నారు ఈ సందర్భంగా బైర్లుటిగూడెం, నాగలూటిగూడెం గ్రామాల ప్రజలు, శ్రీశైలం పాదయాత్రికులు, శివస్వామి భక్తులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. బైర్లుటిగూడెం మీదుగా వందల ఏళ్లుగా శ్రీశైలం పాదయాత్ర సాగుతున్న సంప్రదాయ మార్గాన్ని ఏపీ టూరిజం శాఖ గేట్లు ఏర్పాటు చేశారని అందుకే ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాట్లు చేయాలన్నారు.