శ్రీశైలం: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆత్మకూరు మండల వ్యవసాయ అధికారి
ఆత్మకూరు మండలంలో మండల వ్యవసాయ అధికారి హేమలత గారి ఆధ్వర్యంలో యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి హేమలత మాట్లాడుతూ, ఎరువుల దుకాణ యజమానులు రైతులకు నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రైతులు యూరియా, డీఏపీ ఎరువులను ఒకే దుకాణంలో కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, తమకు నచ్చిన ఎరువుల దుకాణంలో అవసరమైన ఎరువులను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ పాల్గొన్నారు.