అశ్వారావుపేట: అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు.ముందుగా కార్యాలయ పరిసరాలను పరిశీలించారు.అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.కోడిపందాలు,పేకాట,బెట్టింగు లు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కదలికలపై నిఘా పెంచి దొంగతనాల కట్టడికి కృషి చేయాలని అన్నారు.