పటాన్చెరు: చౌదరి గూడెం లో విషాదం చెరువులో ఈతకు వెళ్లి ఒకరి గల్లంతు
జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని చౌదరి గూడెం గ్రామానికి చెందిన పాండురంగ ఈతకు చెరువులోకి వెళ్లి గల్లంతయ్యాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే జిన్నారం పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి హుటాహుటిన ఎస్సై హనుమంత చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు ఆదివారం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్ఐ తెలిపారు.