జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్-కం-జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని సూచనల మేరకు రాజంపేట మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు ఇంచార్జ్ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.ప్రవీణ్ కుమార్, కడప గౌరవ నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.దీన బాబు మరియు గౌరవ కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్.బాబా ఫక్రుద్దీన్ వారు 13-12-2025 వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా, ముందస్తు జాతీయ లోక్ అదాలత్ మీటింగ్ న్యాయ సేవా సదన్ కడప నందు పోలీస్ అధికారులకు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కువ కేసులు రాజీ అయ్యేవిధంగా కృషి చేయాలని కోరారు.